
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటుతుండగా,నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డు నందు పేకల జాను,బత్తిన శీను ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలేశ్వరం పట్టణ వైయస్‌ఆర్‌సీపీ టౌన్ అధ్యక్షులు,శిడగం వెంకటేశ్వరరావు పాల్గొని జెండా వందన కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి,భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా శిడగం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గొడుగు నాగేంద్ర,రాచర్ల రమేష్,ఈపు రాము,గొంతి రెడ్డి సతీష్,పట్టా సుబ్బారావు,కల్దారి శ్రీను,బత్తిన రవి,వైయస్సార్సీపి మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.