మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:గణతంత్ర దినోత్సవం సందర్భముగా ఉత్తమప్రతిభ కనబరచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు అందించారు.కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామ అభివృద్ధి అధికారి రాగతి వీరబాబుకు ఉత్తమ గ్రామ అభివృద్ధిఅధికారి గా ఎంపికయ్యారు, కాకినాడ జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా యస్ పి బిందు మాధవ్ చేతులు మీదుగా వీరబాబుకి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రతిభా పురస్కారము అదుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు.ఈ ప్రతిభా పురస్కారం వల్ల నా పై బాధ్యత మరింత పెంచిందన్నారు.
నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని
ఈ సందర్బంగా రాగతి వీరబాబు తెలిపారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *