filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 0; delta:null; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 117.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 39;

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు కు జీవో విడుదల చేయడం పట్ల ఏలేశ్వరంలో సీఎం డిప్యూటీ సీఎం లకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణస్వామి మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలలో తూర్పు కాపులకు బి సి” డి ‘ సర్టిఫికెట్లతోపాటు కేంద్ర ప్రభుత్వ ఓబిసి సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు అన్నారు. మిగతా జిల్లాల్లో మొదట్లో ఓబీసీ ఇచ్చేవారు కానీ గత పది సంవత్సరాలుగా తూర్పుకాపులు ఓబీసీ జాబితా తొలగించారన్నారు. ఈ విషయాన్ని తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాల్వంచ యశశ్వి, సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి తూర్పు జిల్లాల నుండి మైగ్రేషన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నిమిత్తం ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్లు ఇచ్చేలా జీవో చేశారని, వారికి తూర్పు కాపులు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కోట్ల కృష్ణ,కరోతి గాంధీ, జొన్నాడ వీరబాబు, సామంతుల కిషోర్ కోరాడ కృష్ణ, పాండ్రంకి సత్తిబాబు, శంఖాని బాబ్జి, కిలారి రామచంద్రరావు ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *