తవణంపల్లి జనవరి 22 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ జి ఎఫ్ ఐ చర్చి నందు, పాస్టర్ థియో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి విచ్చేసిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, అలాగే ఐ సి డి ఎస్, సి డి పి ఓ నిర్మల, లీగల్ ఆఫీసర్ వెంకటేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ అవగాహన కార్యక్రమాన్ని దేవాలయాలు, చర్చిలు,మసీదులలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం ఐరాల క్రాస్ జి ఎఫ్ ఐ చర్చ్ నందు ఐరాల తవణంపల్లి పూతలపట్టు మండలాలకు చెందిన పాస్టర్లచే బాల్య వివాహ రహిత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిఎఫ్ఐ చర్చ్ పాస్టర్ థియో స్టీఫెన్ మాట్లాడుతూ బాల్య వివాహం మనదేశంలో ఎన్నో శతాబ్దాలుగా, కొనసాగుతున్న సామాజిక చెడు సంప్రదాయం బాల,బాలికలు, తమ బాల్యాన్ని కోల్పోయి విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, అనే మౌలిక హక్కులను పొందకుండా, భారమైన బాధ్యతలను మోషే పరిస్థితి బాల్య వివాహం వల్లే ఏర్పడుతుందని, ఆయన పేర్కొన్నారు. అనంతరం ఐ సి డిఎస్, సి డి పి ఓ నిర్మల, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, లీగల్ ఆఫీసర్ వెంకటేష్, మండలాల్లో పలు గ్రామాలలో బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాల లోపు, అబ్బాయికి 21 సంవత్సరాల లోపు, పెళ్లి చేస్తే చట్ట ప్రకారం నేరం అని అట్టి పెళ్లిళ్లు ప్రోత్సహించిన వారికి లక్ష జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలపై ఎటువంటి దాడులు జరిగిన, బాల్య వివాహాలు కుదురుతున్నాయని తెలిసిన 1098, మరియు 100 చైల్డ్ లైవ్ నెంబర్ కు, సమాచారం అందించాలన్నారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ఐ సి డి ఎస్ సూపర్వైజర్లు, చర్చి పాస్టర్లచే, మహిళలచే అంగన్వాడి వర్కర్లచే, ప్రతిజ్ఞ చేయించి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు,ఎన్జీవోలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
