మన ధ్యాస, నెల్లూరు, జనవరి 19 : పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి….. మిడతల రమేష్ 26 వేల గృహాలు హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బిజెపి నేతల నిరసన కార్యక్రమం సోమవారం నెల్లూరు నగరం కలెక్టరేట్లో నిర్వహించినారు. ఈ సందర్భంగా బిజెపినేత మిడతల రమేష్ మాట్లాడుతూ…….. నెల్లూరు జిల్లాలో 26 వేల పేదల గృహాలను కాంట్రాక్టర్లు నిర్మాణాలు చేపట్టారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపే వరకు థర్డ్ ఆప్షన్ కింద నిర్మాణాలు నిలిపివేశారు..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు మేరకు 26 వేల గృహాల రికన్సలేషన్ ప్రక్రియ నిర్వహించమని హౌసింగ్ ఎండి తెలిపారు. కాంట్రాక్టర్ లు నిర్వహించిన గృహాల లోపాలను రెక్టిఫికేషన్ చేసి నివేదిక పంపమని ఆదేశించారు.నెల్లూరు జిల్లాలో మాత్రం 2022- 2024 మధ్యకాలంలో స్టీలు సిమెంట్ ను అధికారులు పక్కదారి పట్టించారు. అవినీతి అధికారులను కాపాడడం కోసం రీ కన్సోలేషన్ ప్రస్తుత అధికారం చేయడం లేదు. అవినీతి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రికన్స్ లేషన్ చేయడం లేదు.. గ్రామీణ ప్రాంతంలో హౌసింగ్ నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయబడ్డాయి.. హౌసింగ్ అధికారులు ఆ డబ్బులను వసూలు చేసి కాంట్రాక్టర్లకు అందించవలసి ఉంది.. అధికారులు ఆ పనులను కూడా నిలిపివేశారు. నెల్లూరుజిల్లాలో లబ్ధిదారులు తోపాటు కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పేదల పక్కా గృహాలు ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించడం లేదని కలెక్టర్ హిమాన్స్ శుక్లాకు బిజెపి నేతలు మిడతల రమేష్. కందికట్ల రాజేశ్వరి. పొట్లూరు శ్రీనివాసులు. బైరి శ్రీనివాసులు.సుజన. బుధవరపు బాలాజీ. రఘురామయ్య.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *