మన ధ్యాస,నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుధ్య పరిస్థితులను అధికారులు మరియు ప్రభుత్వ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని అక్కడ సిబ్బందికి సూచించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.నిత్యం వేలాదిమంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, పారిశుధ్య పరిస్థితుల్లో కచ్చితంగా మార్పు రావాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ప్రజల ఆరోగ్య విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జి.జి.హెచ్. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, డైరెక్టర్లు బ్రహ్మారెడ్డి, దారా మల్లి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *