

మన న్యూస్: అబ్దుల్లాపూర్మెట్ పాలకవర్గం,అధికారులు,రైతులు వర్తకులు,హమాలీలు అంతా కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తాం ఎంతో కాలం నుండి పెండింగ్ లో హమాలీలకు అందరికి గుర్తింపు లైసెన్సులు అందచేసిన పాలకవర్గం బుధవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 2 వ పాలకవర్గం సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించడం జరిగింది.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే పాలకవర్గo ఉద్దేశమని అన్నారు.మార్కెట్ ని అందరి సహకారంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు.కొహెడ ప్రాంతంలో దాదాపు 2000 కోట్లతో నూతన సమీకృత మార్కెట్ చేపడతామని ప్రకటించిన మన గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి,గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావుకి పాలకవర్గం ధన్యవాదములు తెలియచేస్తూ తీర్మానం చేసింది. మార్కెట్ పరిధిలోకి వచ్చే రైతు బజార్లను ఎన్టీఆర్ నగర్ మార్కెట్ లను ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించి సమస్యలు లేకుండా చూస్తామని,రైతుల సలహాలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ సిహెచ్ బాస్కర చారి,మార్కెట్ డైరక్టర్లు మచ్చేందర్ రెడ్డి,అంజయ్య,మేకం లక్ష్మి,రఘుపతి రెడ్డి,గణేష్ నాయక్,నరసింహ,నవరాజ్,గోవర్ధన్ రెడ్డి,వెంకట్ గుప్తా,ఇబ్రహీంతో పాటు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్ .శ్రీనివాస్ ఇతర అధికారులు హర్షవర్ధన్ రాజ్కు మార్,విజయ్,మురళి పాల్గొన్నారు.