

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 11 జోగుళాంబ గద్వాల గద్వాల పట్టణంలో పోలీస్పో లీస్ అధికారులు,సిబ్బంది విధులను బాధ్యతా తో నిర్వర్తించడం తో పాటు దృఢంగా ,ఆరోగ్యంగా ఉండటం కూడ ప్రదానం అనీ ,అందుకు వాలీబాల్ వంటి క్రిడాలు సిబ్బంది దృఢంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయి అని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు IPS అన్నారు. జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయ ఆవరణలో పోలీస్ అధికారులకు,సిబ్బందికి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ను ఈ రోజు జిల్లా ఎస్పీ సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు,సిబ్బంది విధులను బాధ్యతా తో నిర్వర్తించడం తో పాటు ఫిజికల్ గా దృఢంగా , మరియు ఆరోగ్యంగా ఉండటం కూడ ప్రదానం అనీ,అందుకు వాలీబాల్ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే చేసే పనులలో శ్రద్ద చూపగలరని ఎస్పీ అన్నారు. పోలీస్ సిబ్బంది అధికారులు ఫిజికల్ గా ధృడంగా ఉండటం తో పాటు తమ ఆరోగ్యం ను కాపాడుకుంటూ వారి కుటుంబ సభ్యులు కూడ హెల్తీ గా ఉండేటట్లు చూసుకోవాలని, పోలీస్ సిబ్బంది కీ క్రీడలు నిజ జీవితంలో ఒక బాగంగా ఉండాలని , అందుకు ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహించాలని పోలీస్అ ధికారులకు,సిబ్బందికి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు లో రోజు సాధన చేయలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి , అర్ ఐ వెంకటేష్, అర్ ఎస్సై లు రామకృష్ణ, విజయ్ భాస్కర్, సాయుధ దళ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.