

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటీపల్లి ఎల్లారెడ్డి,కాటిపల్లివెంకట్ రెడ్డి,హన్మారెడ్డి, కాటిపల్లి లక్మి, రాజంపేట గ్రామ శివారులో గల స సర్వేనెంబర్ 577 లో 11 ఎకరాల 4 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు .ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామ శివారులో సర్వేనెంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి 1978,1979 సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల పేర్ల పైన ఉండేదని 2014,2015 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటీపల్లి హన్మరెడ్డి ,లక్ష్మి , వెంకట్ రెడ్డి అక్రమంగా వారి పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఇట్టి విషయం పైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ,జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు .పహానిలో వేముల అంటే ఎస్సీల కిందికి వస్తుందని, అది మా గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. వాళ్లు వేముల కాటిపల్లి వెంకట్ రెడ్డి,హన్మారెడ్డి ,లక్ష్మి ఎల్లారెడ్డి పేర్లతో పహానిలోకి పేరులను మార్చుకొని తర్వాత వారి పైన మొత్తం 11 ఎకరాల 4గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యంతో డబ్బులకు కక్కుర్తి పడి వారి పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దయచేసి ఇప్పుడున్న అధికారులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత తీసుకోవాలని కోరారు.