మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామంలో విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పచ్ బీసెట్టి అప్పలరాజు, ఏ ఈ సూర్యనారాయణ, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా గ్రామ విద్యుత్ వినియోగదారులతో అదికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ నేపథ్యంలో నాయకులు గ్రామంలో వుండే పలు సమస్యలపై వినియోగదారు అధికారులకు వివరించారు. గ్రామంలో పలు చోట్ల విద్యుత్ వైర్లు క్రిందికి ఉండటం వలన ఇబ్బందులకు గురవుతున్నావని తెలిపారు. గ్రామంలో పాఠశాల వద్ద విద్యుత్ వైర్లు క్రిందికి వేలాడుతున్నాయని వాటిని వెంటనే సరి చేయాలని సూచించారు. గ్రామ నాయకులుసూచించిన సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారికి విద్యుత్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకారావు, గంగిరెడ్ల మణికంఠ,బండారు సూరిబాబు,లైన్ ఇన్స్పెక్టర్, రాజు,లైన్మెన్,అప్పారావు,హెల్పర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *