
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :జిన్నో సమ్మిట్
2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఈ రోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డివిజన్ డీఎస్పీ శ్రీహరి రాజు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ యేలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ,నేటి డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై అవగాహన ప్రతి యువకుడికి, విద్యార్థికి అత్యంత అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పెద్ద స్థాయి టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించడం అభినందనీయం.జిన్నో సమ్మిట్, 2026 యువతకు సరైన దిశానిర్దేశం చేస్తుంది అని తెలిపారు.అలాగే, ఈ సమ్మిట్‌లో సైబర్ నేరాలపై అవగాహన డిజిటల్ భద్రత,AI వినియోగం,స్టార్టప్ అవకాశాలు వంటి అంశాలు చర్చించబడతాయని పేర్కొన్నారు. ప్రతి యువకుడు, విద్యార్థి ఈ సమ్మిట్‌లో తప్పనిసరిగా పాల్గొని తమ భవిష్యత్తును సురక్షితంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ జిన్నో సమ్మిట్
జనవరి 25,2026 ఏలేశ్వరం వేదిక ఫంక్షన్ హాల్ లో
నిర్వహించబడనుంది.గ్రామీణ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసి, సైబర్ సెక్యూరిటీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్ రంగాల్లో అవకాశాలను అందించే వేదికగా ఈ సమ్మిట్ నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.ఈ భారీ సమ్మిట్‌ను గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు ముందుకు వచ్చిన స్పార్క్ సంస్థను ఆయన అభినందించారు.స్పార్క్ చైర్మన్ సందీప్,సంస్థ సి ఈ ఓ ప్రదీప్ ను అభినదించారు.గ్రామీణ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసి,సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,స్టార్టప్స్ రంగాల్లో మార్గదర్శకంగా నిలిచే వేదికగా జిన్నో సమ్మిట్ 2026 నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.రిజిస్ట్రేషన్ కొరకు స్పార్క్ ను సంప్రదించగలరు