
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని పెద్దాపురం డి.ఎస్.పి. డి శ్రీహరి రాజు అన్నారు.వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు బుధవారం విచ్చేశారు. తొలుత స్టేషన్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్సై ఎన్. రామలింగేశ్వరరావు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందన్నారు.స్థానికంగా 2025 సంవత్సరంలో జరిగిన బట్టల షాప్, నగల దుకాణంలో జరిగిన చోరీలను టెక్నాలజీ సహాయంతో వేగవంతంగా కేసులను ఛేదించి, బంగారం రికవరీ చేశారని అన్నారు.అలాగే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి దొంగతనాలకు గురైన మోటర్ బైకులు, సెల్ ఫోన్లు దొంగలను గుర్తించి పట్టుకోవడం జరిగిందని, బైకుల యజమానులకు వారి సొత్తు అప్పజెప్పడం జరిగిందన్నారు.పోలీస్ యంత్రాంగం అప్రమత్తతో మెలిగి నేరాలను శీఘ్రంగా అరికట్టారని, వీరేందర్నీ అభినందిస్తున్నాను అన్నారు.హైవే బస్ స్టాండ్ ల వద్ద, బస్ స్టేషన్లలో చైన్ స్నేకర్స్, జేబుదొంగలను అరికట్టేందుకు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలీస్ నిఘా పెంచామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు, ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు. రానున్న సంక్రాంతి ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణం లో బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సంక్రాంతి పేరు చెప్పి నిబంధనకు విరుద్ధంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా, కోడిపందాలు, జూధాలు నిర్వహించినా, ప్రోత్సహించిన చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు సిఐ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్సై ఎన్ రామలింగేశ్వర రావు సిబ్బంది పాల్గొన్నారు.