
*పార్థివ దేహం సందర్శనానికి లింగంపర్తి తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జననేత వరుపుల తమ్మయ్య బాబు హఠాన్మరణం పట్ల పలువురు దిగ్బ్రాంతి చెందారు.మండల పరిధి లింగంపర్తి గ్రామానికి చెందిన వరుపుల తమ్మయ్య బాబుకు సోమవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. స్థానికంగా డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం బంధువులు కాకినాడ తరలించారు.తమ్మయ్య బాబు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమాచారం అందిన వెంటనే తమ్మయ్య బాబు ఇంటి వద్దకు చేరుకున్న అభిమానులు, జనసైనికులు, జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులు లింగంపర్తి తరలివచ్చారు. తమ్మయ్య బాబు పార్టీవదేహాన్ని దర్శించుకున్న అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు. లింగంపర్తి గ్రామం అంత శోకసముద్రంలో మునిగిపోయింది. వరుపుల తమ్మయ్య బాబు 2018లో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు.2004 నుండి 2009 వరకు ఏలేశ్వరం మండల అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వహించారు.ప్రజా మన్ననలను పొందిన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన తమ్మయ్య బాబు ప్రజలకు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండేవారు. ఆయనకు భార్య దుర్గ వేణి,కుమార్తె కుమారుడు ఉన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ, కందుల దుర్గేష్, డీ.సి.సి.బి చైర్మన్ తుమ్మల బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, తోట నవీన్, జ్యోతుల నవీన్, జనసేన పార్టీ నాయకురాలు ముద్రగడ కుమార్తె క్రాంతి, వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అనంత ఉదయ భాస్కర్, ముద్రగడ గిరిబాబు, నియోజకవర్గ పరిధిలో పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి తమ్మయ్య బాబు పార్థివ దేహాన్ని సందర్శించుకున్నారు.