మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయంవద్ద మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు.శ్రీ శారద వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ అభిమాన నేత పర్వత ప్రసాద్ జన్మదిన పురస్కరించుకుని పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు.జాతీయ రహదారిపై నిరాశ్రయ వృద్ధులు పలువురికి పండ్లు దుప్పట్లు మామిడి నరసింహమూర్తి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా తమ అభిమాన నేత పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ఆ భగవంతుని ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా ఆయన భగవంతుడను కోరుకున్నానన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *