.జియ్యమ్మవలస/ కొమరాడ /మనధ్యాస/డిసెంబర్ 28 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో భాగంగా కురుపాం శాసనసభ్యురాలు, రాష్ట్ర ప్రభుత్వ విప తోయక జగదీశ్వరి ఈ ప్రత్యేక చొరవతో పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి ఆయన అన్నారు.దీనిపై కొమరాడ మండల తెలుగు రైతు అధ్యక్షులు బత్తిలి శీను హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.గత కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఈ రహదారిని పండగ లోపే బాగు చేయాలని ఎమ్మెల్యే జగదీశ్వరి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు, వాహనదారులకు ఈ మరమ్మత్తుల వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించిన తోయక జగదీశ్వరి మేడం ఈ ప్రాంత ప్రజలందరూ రుణపడి ఉంటారని బత్తిలి శీను పేర్కొన్నారు.రైతుల సంక్షేమం అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ రహదారి అభివృద్ధి చెందడం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *