*సంఘ మహిళలకు నారాయుడు సొంత నిధులతో 50 చీరలు పంపిణీ*

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:క్రిస్మస్ సకల జనుల పండుగ అని,యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొండాడ నారాయుడు అన్నారు.ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఊబా కృపావరం ఆహ్వానం మేరకు బిలీవర్స్ బాప్టిస్ట్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకల్లో బొండాడ నారాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘంలో ఉన్న 50 మంది మహిళలకు ఆయన తన సొంత నిధులతో చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నారాయుడు మాట్లాడుతూ ఏసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి సంతోషాల కోసం కరుణ,ప్రేమను అందరికి పంచారన్నారు.యేసుక్రీస్తు చూపిన సత్యమార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని అన్నారు.క్రీస్తు ప్రవచించిన విధంగా తోటివారికి సహాయ పడడంలోనే దైవత్వం ఉందని తెలిపారు.సమాజంలో ఆయన చూపిన కరుణ,జాలి,ప్రేమ మార్గాన్ని అందరు అనుసరించాలన్నారు.తోటి వారిపై గౌరవం,దయ కల్గి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ అంబటి పాల్ సామ్యూల్,నామాడి వాల్టన్,అన్నారం, రాజుబాబు,బుజ్జారియా,స్థానిక పెద్దలు,విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *