మన ధ్యాస , నెల్లూరు రూరల్, డిసెంబర్ 26:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళెం కలుజు ప్రాంతాన్ని ఆర్ & బి, ఇరిగేషన్, సర్వేయర్ మరియు రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శానసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలకోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిపనులు జరుగుతున్నాయి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.మాటకు కట్టుబడివుండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా, అండగా ఉంటాం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జిని నిర్మించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ , యువనేత,రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ , రాష్ట్ర మంత్రివర్యులు బి.సి. జనార్ధన్ రెడ్డి రాష్ట్ర మంత్రి రామానారయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గకి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి జరుగుతుంది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ మీరామోహిద్దీన్, సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, నెల్లూరు రూరల్ మండల బి.సి.సెల్ అధ్యక్షుడు కందల హరి యాదవ్, టిడిపి నాయకులు జి.వెంకటేశ్వర్లు నాయుడు(జి.వి.యన్.), నేరెళ్ల వెంకటరమణయ్య, నరసింహచారి, పెంచలయ్య, నావాజ్, చెంచయ్య, మల్లి, అలియాస్, నరసయ్య, శ్రీనివాసులు, సీనయ్య, కరిముల్లా, శివ, అనిల్, శ్రీనాథ్,అశోక్, వెంకటరమణ, మహేష్, హర్ష, కిరణ్, శ్రీనయ్య, సుధాకర్, కోటి, ఆనంద్, శివ తదితరులు పాల్గొన్నారు.

