విద్యార్థుల భవిష్యత్తుతో,ఆటలాడుతున్నారు గందరగోళం మధ్య విచారణ విచారణ వాయిదా వేసిన త్రీ మాన్ కమిటీ

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 10: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం రాజకీయంగా మారింది. గత నెల రోజులుగా విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు ఆటలు ఆడుకుంటున్నారు.600 మందికి పైగా విద్యార్థులు పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోచదువులు సాగిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం నిర్వాహకులు సక్రమంగా వంటలు చేయడం లేదని, ఆ వంటలు పిల్లలకు రుచించడం లేదని పలువురు తల్లిదండ్రులు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పట్టించుకోకపోవడంతో పిల్లలు కోసం కొంతమంది తెలుగుదేశం నాయకులు పట్టుబట్టి పాత వంట నిర్వాహకులును తొలగించి కొత్తవారిని వేయడానికి పావులు కదుపుతున్నారు. కానీ పిల్లలు మాత్రం వంట నిర్వాహకులు సక్రమంగానే వంటలు చేస్తున్నారని, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని కొంతమంది పిల్లలు చెబుతున్నారు. మరి కొంతమంది మాకు వద్దు కొత్తవారు కావాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రంగంలోకి దిగి మండల విద్యాశాఖ అధికారి త్రీ మాన్ కమిటీని మంగళవారం నాడు హైస్కూల్ కు పంపించారు. విచారణ జరిపి నివేదిక పంపించమని మండల విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. హై స్కూల్ వద్ద విచారణ సమయంలో గందరగోళంగా మారింది. కొంతమంది పిల్లలు వంట నిర్వాహకులు వద్దని, మరి కొంతమంది కావాలని తేల్చి చెప్పడంతో తాసిల్దార్ రవి, ఎంపీడీవో పట్నాయక్, ఎంఈఓ జోగారావు, ప్రధాన ఉపాధ్యాయులు ఈశ్వరరావు విచారణ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ యడ్ల రమేష్ విలేకరులతో మాట్లాడుతూ వంట నిర్వాహకుల కమిటీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని అధికారులను కోరగా, పిల్లలు భోజనం బాగు లేదంటే మేము నిర్వాహకులను తొలగిస్తామని లేదంటే తొలగించడం జరగదని ఎంపీడీవో,తాసిల్దారు, విద్యాశాఖ అధికారి తెలిపారు. మరొకసారి విచారణ జరిపి హై స్కూల్ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వంట నిర్వహకులు కొంతమంది నాయకులు మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపై పలువురు తల్లిదండ్రులు ఈ విధంగా ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని పెదవి విరుస్తున్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.

    సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.