బంగారు పాళ్యం,మన ద్యాస, డిసెంబర్ 21

కల్లూరు పల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. మండల వైకాపా అధికార ప్రతినిధి, RCDS చిత్తూరు జిల్లా అధ్యక్షులు కమలాపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతం జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ది చేందాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మళ్లీ సిఎం అవ్వాలని వైకాపా నాయకులు అన్నారు. వైస్ రాజశేఖర రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన రెడ్డిల పరిపాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. సుపరిపాలన అంటే ఏమిటో వారు చేసి చూపించారన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి దేశ, విదేశాల్లో పేరొందారన్నారు. జగన్మోహన రెడ్డి పాలనను సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చన్నారు. అటువంటి నేత మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, అందుకు మనమంతా ఇప్పటి నుండే కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రూపేష్, మొగిలీశ్వర్, నగేష్, దయసాగర్,శ్రీధర్, సతీష్, తులసి,సంజు,కిషోర్, మాలతి, లక్ష్మి,జయకుమార్, కిరణ్, దినేష్, కరుణాకర్ రెడ్డి, రామయ్య, రమేష్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామచంద్ర రెడ్డి,సుదర్శన్ రెడ్డి, సుబ్బన్న, గిరిధర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి మరియు యువకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *