పెద్ద కొండూరు పంచాయతీ పెద్దపాడు గ్రామంలో పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కలు వేసిన టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వహణ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు
కలిగిరి, డిసెంబర్ 21,మన న్యూస్, (కె నాగరాజు)
పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం: టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు
కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామపంచాయతీ పెద్దపాడు గ్రామంలో స్కూల్ నందు నిర్వహించిన పల్స్ పోలియో నివారణ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్కూల్‌కు వచ్చిన చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో,చుక్కలువేసి,కార్యక్రమాన్ని,ప్రారంభించారు.అనంతరం బొల్లినేని వెంకట రామారావు మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగనిర్మూలించేందుకు ప్రతి తల్లి-తండ్రి తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు,సూచించారు.చిన్న వయసులోనే రక్షణ చర్యలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలియో చుక్కల ప్రాధాన్యతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆరోగ్య పరిరక్షణ పట్ల బాధ్యత, మరింతబలపడుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు