కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం,ఇల్లు కట్టించి ఇస్తానని భరోసా
బాధితులకు, బంధువులు, నాయకులు, అండగా ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే
వింజమూరు, డిసెంబర్ 21,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె)
ఇల్లు కాలిపోయి నిరాశ్రయులుగా మిగిలిపోయిన బాధితులకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కొండంత అండనిచ్చారు. వింజమూరు మండలం నల్లగొండ్ల ఎస్టి కాలనీకి చెందిన పోలయ్య ఇల్లు శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదివారం సాయంత్రం వారి నివాసం వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు. జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని టిడిపి పార్టీ మరియు నాయకులు నేను అందరం అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా తక్షణ ఆర్థిక సహాయంగా 25 వేల రూపాయలను అందజేశారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం ద్వారా రెండు కాలనీలను మంజూరు చేయించి ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు. అత్యవసరంగా ఉండేందుకు తాత్కాలిక ఇంటిని ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు. అదేవిధంగా కాలనీలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, స్థానిక నాయకులు, అనిపి రెడ్డి తిరుపాలు రెడ్డి, మాజీ సర్పంచ్ పెంచల రెడ్డి, బి సుబ్రహ్మణ్యం, ఓబులరెడ్డి, మురళి, అశోక్, శ్రీనివాసులు రెడ్డి, వెంగళరావు, గూడా నవీన్, సుబ్బరాయుడు, దనిరెడ్డి సురేష్ తదితరులు ఉన్నారు
