- అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం..
- బాలికల ఆశ్రమానికి రూ.30 వేల విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ…
- ధ్యానం, శాఖాహారం,పిరమిడ్ జగత్ స్థాపనే పత్రీజీ ఆశయం: వక్తలు…..
గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 11 :అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో పత్రీజీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీసాల శివ గణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు గంటల పాటు సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ధ్యాన సాధకులు, పిరమిడ్ మాస్టర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. పత్రీజీ ఆశయాలైన ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతాయని, పత్రీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ధ్యాన సాధకుడిపై ఉందని పేర్కొన్నారు.అనంతరం పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి పత్రీజీ అవతరణ దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.బాలికల ఆశ్రమానికి రూ.30 వేల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ.వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీనగర్, నడుపూరు, పెదగంట్యాడ ప్రాంతంలోని బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ బాలికల ఆశ్రమానికి సుమారు రూ.30 వేల విలువైన నిత్యావసర సరుకులను పత్రీజీ పేరు మీద అందజేశారు. ఆశ్రమ నిర్వాహకులు మూర్తికి ఈ సరుకులను అందించారు. అనంతరం ఆశ్రమంలోని బాలికలకు ధ్యానం చేయించి, పండ్లు, మిఠాయిలు, బిస్కెట్లను పంపిణీ చేశారు.పత్రీజీ అవతరణ దినోత్సవాన్ని ధ్యానం, ఆధ్యాత్మిక సందేశాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు వనిత, అప్పలరాజు, భాగ్యగౌరి, భానుమతి, అప్పారావు, చిన్నారావు, కనకారావు, కనకలక్ష్మి, నీలకంఠం, శ్రీకాంత్, అచ్చుతాంబ, రమణారావు, విజయలక్ష్మి, ఋషి, వెంకటలక్ష్మి, విష్ణుకుమార్, రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.