​తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన తెదేపా అభ్యర్థిగా 5వ డివిజన్ నుండి ఘనవిజయం సాధించిన కార్పొరేటర్ స్వప్న , తన భర్త, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి తో కలిసి గురువారం తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ స్వప్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి శాలువా కప్పి,పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం 5వ డివిజన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై వారు తుడా ఛైర్మన్‌ తో చర్చించారు.కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవలో నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *