రేణిగుంట మండలానికి చెందిన పసేలి రాజేష్, యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ , వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ని అఖిలభారత ఎన్జీవో వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కె.బి ఆర్. ఫౌండేషన్ సంయుక్తంగా అందించే ప్రతిష్టాత్మక సేవా పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈనెల 15వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరులోని ఏసీ కాలేజీలో జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఎనిమిదవ సమాజ సేవకుల ఆత్మీయ సమ్మేళనంలో ఈ యొక్క అవార్డును ప్రధానం చేయడం జరుగుతుంది. గత పది సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఆపద సమయాల్లో అనేకులకు రక్తదానం చేస్తూ యువత చేత రక్తదానం చేపిస్తూ విశిష్ట సేవలందిస్తున్న రాజేష్ ని అనేకులు అభినందించడం జరిగింది . ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన కేబిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొడవటికంటి బాలరాజు కి మరియు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు. ఈ పురస్కారం లభించడం ద్వారా సమాజంలో ఇంకా ఎక్కువ సేవ చేయుటకు బాధ్యత మరింత పెరిగిందని ఆయన తెలియజేశారు.
