కండలేరులో ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు…సి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*స్పిల్ వే గేట్ల వద్ద నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు అవాంతరాలే

మన ధ్యాస,మనబోలు ,డిసెంబర్ 6:
సర్వేపల్లి నియోజకవర్గం,మనుబోలు మండలం కొలనకుదురు, కట్టువపల్లి, బద్దెవోలు, వెంకన్నపాలెం గ్రామాలలో శనివారం పర్యటించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని అనేక గ్రామాలు సముద్రాలను తలపిస్తున్నాయి .జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో నాట్లు, నార్లు దెబ్బతిన్నాయి .రైతులకు ఉచితంగా విత్తనాలు అందజేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కోరాం అని అన్నారు.హైవే నుంచి కొలనకుదురు వెళ్లే మార్గాన్ని వరద ముంచెత్తి రాకపోకలు నిలిచిపోయాయి అని అన్నారు.వెంకన్నపాళెం, బద్దెవోలు, పిడూరుపాళెం, కట్టువపల్లి, కొలనకుదురు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.3.2 కిలోమీటర్ నుంచి 5వ కిలోమీటర్ వరకు రోడ్డు ఎత్తును పెంచకపోతే భవిష్యత్తులోనూ సమస్యలు తప్పవని మండల నాయకులు చెబుతున్నారు. ముత్తుకూరు, చిల్లకూరు మండలాల మధ్య రాకపోకల కోసం కండలేరుపై కృష్ణపట్నం పోర్టు కోసం అప్పట్లో నవయుగ కంపెనీ కట్టిన బ్రిడ్జి కారణంగానూ నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతోంది అని అన్నారు.నీటి ప్రవాహానికి అనుగుణంగా కాకుండా సొంత డిజైన్ తో బ్రిడ్జి కట్టేయడంతో ఈ పరిస్థితి నెలకొంది అని అన్నారు.కండలేరులో ప్రవాహం సాఫీగా సాగక ఊళ్లకు ఊళ్లు జలమయమై మనుషుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది అని అన్నారు.ప్రజల అవసరాలు, ఇబ్బందులను పట్టించుకోకుండా ఒక ప్రణాళిక లేకుండా బ్రిడ్జి నిర్మించడం దురదృష్టకరం అని అన్నారు.
వాళ్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగిపోవాలి.. గ్రామాలు మునిగిపోయి ప్రజలు మాత్రం ఇబ్బంది పడాలి అని అన్నారు.వంతెన డిజైన్ మార్చి పునర్నిర్మాణం చేయాలి అని అన్నారు.కండలేరు వాగులో పూడిక తీసి వెడల్పు చేయాల్సి ఉంది అని అన్నారు.జలాశయం స్పిల్ వే నుంచి నీళ్లు వదిలితే పొదలకూరు మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి ఎస్టీ కాలనీ, వావింటపర్తి గ్రామాలు మునిగిపోయే పరిస్థితి అని అన్నారు.అక్కడ ప్రవాహం సాఫీగా సాగేందుకు రూ.92 కోట్లతో ప్రతిపాదనలు పంపివున్నారు అని అన్నారు.ఇవన్నీ అత్యవసరమైన పనులు….జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు.మా సిఫార్సులుగా భావించకుండా ప్రజా ప్రయోజనాల నేపథ్యంలో అత్యవసరమైన పనులుగా చేపట్టాలి అని అన్నారు.
ఈ భారీవర్షాల నేపథ్యంలో కండలేరుకు ఇన్ ఫ్లో 40 వేల క్యూసెక్కులు దాటివుంటే అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడేవి అని అన్నారు.స్పిల్ వే షట్టర్లు ట్రయల్ రన్ చేయడం కోసం అధికారులు ఇబ్బంది పడ్డారు. నెల్లూరు నుంచి కలెక్టర్, ఆర్డీఓతో పాటు నా కుమారుడు రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు హుటాహుటిన డ్యాం వద్దకు వెళ్లారు అని అన్నారు.జనరేటర్ పనిచేయకపోవడంతో పొదలకూరు నుంచి అత్యవసరం మా నాయకులే మరో జనెరేటర్ తెప్పించారు అని అన్నారు.కండలేరులో ప్రవాహం పెరిగిన ప్రతిసారి తిరుమలమ్మపాళెం ప్రజలకు కష్టాలు తప్పడం లేదు…బోటుపై రాకపోకలు సాగించాల్సివస్తోంది అని అన్నారు. తిరుమలమ్మపాళెం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాల్సిన బాధ్యత కూడా జిల్లా అధికారులపై ఉంది అని అన్నారు.నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిరుమలమ్మపాళెం వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తెచ్చి శంకుస్థాపన చేశాం అని అన్నారు.కాంట్రాక్టర్ మెటీరియల్ మొత్తం తోలుకుని పనులు ప్రారంభించే సమయంలో అధికారం మారడంతో నిర్మాణ పనులను అర్థంతరంగా ఆపేశారు అని అన్నారు.
రైతులు, రైతు ప్రయోజనాలు, ఇరిగేషన్ వ్యవస్థ నిర్వహణ తదితర అంశాలను వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించారు అని అన్నారు.సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి నిద్రలేస్తే నన్ను, నా కుమారుడి జపం చేయడం, నోటికొచ్చినట్టు దూషించడమే పనిగా పెట్టుకున్నాడు అని అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఇబ్బందులు, రైతుల అవసరాలు ఆయనకు పట్టలేదు…ఇప్పుడు కూడా నన్ను, నా కొడుకుని తిట్టే కార్యక్రమం కొనసాగిస్తున్నాడు అని అన్నారు.పొట్టేళ్ల కాలువ నుంచి యనమడుగు వరకు పూడికతీసినట్టు చూసి రూ.40 లక్షలు బిల్లులు చేసుకున్నారు అని అన్నారు.వైసీపీ హయాంలో ఒక్క తట్ట మట్టి ఎత్తకుండానే ఇరిగేషన్ ఆఫీసులోనే కూర్చుని దోపిడీకి పాల్పడ్డారు అని అన్నారు.ఐదేళ్లూ కాకాణి అండ్ బ్యాచ్ చేసిన దురాగతాలకు సర్వేపల్లిలో ఇరిగేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అని అన్నారు.ఒక్కో చెరువుకు రెండు మూడు సార్లు షట్టర్లు మార్చినట్టు చూపి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో రూ.7 కోట్లు దోచుకున్నారు అని అన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం