రేపు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రవీణ దంపతులు వరికుంటపాడు మండలానికి రాక..కొండాయపాలెం నుండి తొడుగుపల్లి తారు రోడ్డు ప్రారంభోత్సవం..కొండాయపాలెం మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు ప్రారంభోత్సవం..మండలంలోని టిడిపి జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరు కావాలి…టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు..
వరికుంటపాడు, నవంబర్ 26 మన ధ్యాస న్యూస్ /::
వరికుంటపాడు మండల పరిధిలో కొండాయపాలెం నుండి తొడుగుపల్లి మీదుగా పామూరు పల్లి వరకు కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించినటువంటి తారు రోడ్డు, కొండాయపాలెం మెయిన్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి రోడ్డును రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆయన సతీమణి కాకర్ల ప్రవీణ హాజరుకానున్నారు. కనుక మండలంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు పిలుపునిచ్చారు…







