ఉదయగిరి, నవంబర్ 26 మన ధ్యాస న్యూస్ ://
ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలలా లోని ఉన్నాటువంటి అన్నీ పంచాయతీ లలో నిరుపేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో నూతన ఇల్లు మంజూరుకు మన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుకు అవకాశం కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య అన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 2 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని 8 మండలాల లోని అన్నీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కు స్థానిక సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. సంబంధిత లబ్ధిదారులు అధికారులను స్థానిక నాయకులను సంప్రదించి నవంబర్ 30 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవారినికి ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారధ్యంలో నూతన ఇల్లు నిర్మించు కొనుటకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నియోజకవర్గం లోని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు*







