మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంగళవారం స్వదేశానికి చేరుకున్న వెంటనే, ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి హైదరాబాదులోని ఆయన నివాసంలో హృదయపూర్వక పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఎన్నుకోబడిన ఏలే మల్లికార్జున్ కు డోంగ్లి మండల అధ్యక్షులు గజానంద్ దేశాయ్,మండలంలోని సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.అలాగే నూతన డిసిసి అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ నియమించడం కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శక్తికి కొత్త ఊపునిచ్చే అంశాలుగా నాయకులు అభిప్రాయపడ్డారు.
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి,పార్టీ బలోపేతానికి ఈ ఇద్దరు నేతల సమన్వయం మరింత బలాన్నిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్,నాయకులు సాయి పటేల్,రాము రాథోడ్త,దితరులు ఉన్నారు








