మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు(చిన్న శ్రీను)అన్నారు. సోమవారం మధ్యాహ్నం మండలంలోని వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీను నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా సమితి సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరతో కలిసి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని చూపించాలని, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేస్తే అన్ని స్థానాల్లో విజయడంకా మోగిస్తామని, అయితే పార్టీ విజయం మీ చేతుల్లోనే ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వైకాపా వెంటే ఉన్నారని, వారి అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త తమ పరిధిలోని ప్రజలను తరచూ కలుస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఫల్యాలను వివరించాలన్నారు. అదేవిదంగా నేటి ప్రభుత్వాన్ని అభిమానించే వారికి కూడా కూటమి నేతలు చేస్తున్న మోసం, అవినీతి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అలాగే మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే, పార్టీ నిర్దేశించిన గడువులోగా కమిటీలను పూర్తి చెయ్యాలన్నారు. వార్డు, పంచాయితీ, మండలం, నియోజక వర్గం పరిధిలో వెయ్యాల్సిన తొమ్మిది కమిటీలను త్వరితగతిన భర్తీ చెయ్యాలన్నారు. అదేవిదంగా ఏజన్సీ గ్రామాలపై కూడా దృష్టి పెట్టాలని, గిరిజన గ్రామాల్లో పార్టీ పటిష్ఠంగా ఉందని ధీమా పడవద్దన్నారు. కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మనదే అంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. మండల వైకాపా అద్యక్షులు సువ్వాడ భరత్ శ్రీనివాస్, తోణాం, మావుడి, పారన్న వలస సర్పంచులు మువ్వల ఆదయ్య, పీడిక సుదర్శన దొర, చొంగలి లక్ష్మణ, శివరాం పురం, కురుకూటి ఎంపీటీసీలు కళ్లేపల్లి త్రినాథ నాయుడు, సుబ్బారావు, మండల కో-ఆప్సన్ సభ్యులు సూర్యనారాయణ( సువార్త రావు)మామిడి పల్లి, కురుకూటి ఉప సర్పంచులు, సాదాపు త్రినాథ, చిన్నా పాత్రుని సాంబ, సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దండి అనంత కుమారి, మామిడి పల్లి పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు పెద్దింటి మాధవ రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పరిమళ, గిరిజన నాయకులు చోడిపిల్లి బీసు, నెమలి పిట్ట కళ్యాణ్, కొండగొర్రి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.