మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) పండగల ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎంపీడీవో శివకృష్ణ,ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణి, పంచాయతీ కార్యదర్శి భీం రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనీస్ పటేల్ లు కలిసి డ్వాక్రా గ్రూపు మహిళలకు పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం పొదుపు సంఘాల ద్వారా లోన్లు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సిసి సాయిలు,నాయకులు రాము రాథోడ్,అజర్, డ్వాక్రా మహిళలు తదితరులు ఉన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చిరంజీవి డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరాలను పంపిణీ చేశారు.







