మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్‌లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని విస్తృతంగా తెలియజేయాలని ఆయన సూచించారు. పార్టీకి మీ సేవలను మరింత బలోపేతం చేసేలా ముందుకు సాగాలని ఏలే మల్లికార్జున్‌కు పీసీసీ అధ్యక్షుడు సూచించారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *