డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయండి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన బంగారుగూడెం గ్రామస్తులు

మన న్యూస్: పినపాక, దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుచేసింది. అసంపూర్తి నిర్మాణాలతో పేద ప్రజలను అయోమయానికి గురిచేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఆశించిన ప్రజలు అర్ధాశలతో పూర్తి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
కరకగూడెం మండలం, కన్నాయిగూడెం గ్రామపంచాయతి, బంగారుగూడెం గ్రామంలో 2022లో 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. కాంట్రాక్టు పొందిన సదరు కాంట్రాక్టర్ సగం వరకు పూర్తి చేసి చేతులు దులిపేసుకున్నాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ఇసుక, ఇటుక, ఐరన్, సిమెంట్ వంటి వాటిని ఇటీవల కాంట్రాక్టర్ వేరే చోటికి తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు బంగారుగూడెం గ్రామస్తులందరూ పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను కలిసి వినతి పత్రం అందజేశారు. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి పేదల కళలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు. బంగారుగూడెం గ్రామస్తులు శిధిలమైన ఇళ్ళల్లో నివసిస్తూ భయం భయంగా జీవిస్తున్నారని తెలిపారు .కొన్ని ఇండ్లు నేలమట్టమయి ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బంగారుగూడెం గ్రామాన్ని సందర్శించి తప్పకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు .ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడెం నాగేశ్వరరావు, కోడెం రామారావు ,పూనెం విష్ణుమూర్తి ,బంగారు రామయ్య , కోడెం సత్యవతి, కోడెం గంగ,గొగ్గెలి మాణిక్యం, గొగ్గెలి రాధ ,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లీ మండలంలోని సిర్పూర్–మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను బాన్సువాడ సబ్‌ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు.ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం,నగదు తదితరాలను అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని…

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం