

మన న్యూస్: పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో పినపాక మండలం పినపాక గ్రామంలో కోడి రెక్కల రామక్క (80) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణం తో మరణించగా ఆ నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం గా దశదిన కర్మలకు 25 కేజీల బియ్యం వితరణగా అందించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, కొంపల్లి నగేష్, కోణారపు శ్రీను కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…