మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని సుల్తానగర్ గ్రామ శివారులో గల గుల్ గెస్ట్ హౌస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎస్ ఐ శివకుమార్ పర్యవేక్షించారు.వాహనదారుల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,ఇన్స్యూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలను పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే దానిపై కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ శివకుమార్ మాట్లాడుతూ… రోడ్లపై సురక్షితంగా ప్రయాణం జరగాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి.మద్యం సేవించి వాహనం నడిపేవారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదు.అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తాం అని హెచ్చరించారు.అలాగే వాహనదారులు రాత్రి వేళల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని,వేగం నియంత్రణలో ఉంచాలని, హెల్మెట్ లేదా సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలు — డ్రైవింగ్ లైసెన్స్,రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్,ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని,వాహనంలో సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు.
ఎస్ ఐ శివకుమార్ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని,భద్రత మన చేతుల్లోనే ఉందని తెలిపారు. ఎస్ఐ వెంట పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.









