రైతు సంక్షేమమే మా లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ఎరువులు ప్రతి రైతుకూ అందేలా చూడాలని ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలు..!
దుత్తలూరు నవంబర్ 7 మన ద్యాస న్యూస్ ://
దుత్తలూరు మండల కేంద్రంలో రైతు సంక్షేమం లక్ష్యంగా రైతు భరోసా కేంద్రం వద్ద ఒక విశిష్ట కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గౌరవనీయులైన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ రైతులకు యూరియా ఎరువులు మరియు శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానుకూలంగా అందించడమే కాకుండా, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ — “ప్రతి రైతుకు సమయానికి ఎరువులు, విత్తనాలు పొందేలా చర్యలు తీసుకునేలా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేసేలా, రైతులకు అశాంతి చెందకుండా, వ్యవసాయ సీజన్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రతి స్థాయిలో సహకరిస్తుందని అన్నారు.అలాగే ఆయన రైతుల సమస్యలను సమయానికి పరిష్కరించి, వారికి అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకత అందించాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను, ఆర్‌బీకే సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు కాకర్ల మధుసూదన్, ఐటీడీపీ అధ్యక్షుడు సింగవరపు సుబ్బారెడ్డి, కంభం వెంకటేశ్వర రెడ్డి, కంభం సుబ్బారెడ్డి, వ్యవసాయ అధికారి సిహెచ్. మదన్ మోహన్, దుత్తలూరు ఆదర్శ రైతు చుండి అంజిరెడ్డి, సొసైటీ సీఈవో లోకనాథ్ రెడ్డి, అలాగే ఆర్‌బీకే సిబ్బంది పాల్గొన్నారు.










