కావలి, నవంబర్ 06 మన ద్యాస న్యూస్ ://
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని కొత్తపల్లి గ్రామం లో గురువారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్ జి ఎమ్ ) సౌజన్యంతో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిఖరము నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం ఈవో శ్రీనివాసు రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు లింగ నిర్ధారిత వీర్యం ఉపయోగించి 90% పైగా ఆడదోడలను పొందవచ్చని ఆయన తెలిపారు. కావలి డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు మల్లారెడ్డి ఈ శిఖరాన్ని ప్రారంభించి పశువులను ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించాలని ఆయన కోరారు.అనంతరం కావలి ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు కామేశ్వరరావు మాట్లాడుతూ పాడి రైతులు ఏడాదికి ఒక దూడ పొందే విధంగా యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలియజేశారు.అనంతరం స్థానిక పశు వైద్యాధికారి డివిఆర్ నాయక్ పశువులలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఇ టీ ) పద్ధతి ద్వారా మేలు జాతి దూడలను పొందవచ్చని తెలిపారు. ఈ శిఖరంలో 55 దూడలకు నట్టుల నివారణ చేశారు. 28 సాధారణ చికిత్సలు నిర్వహించారు. ఈ గర్భకోశా చికిత్స శికరానికి స్థానిక నాయకులు పాటబండ్ల వెంకటేశ్వర్లు, చీమ్మిలి వెంకటేశ్వర్లు(రాయుడు ), యర్రా మాధవరావు, గోపాలమిత్ర మాల్యాద్రి, సిబ్బంది, రైతు లు తదితరులు పాల్గొన్నారు.










