నర్రవాడ వెంగమాంబ తల్లి దేవస్థానం నందు దీపాలు తో బారులు తీరిన భక్తులు. కార్తీక్ పౌర్ణమి సందర్భంగా నర్రవాడ వెంగమాంబ తల్లి దేవస్థానం నందు భక్తులతో నిండిపోయిన దేవస్థానం…
దుత్తలూరు, నవంబర్ 05 (మన ద్యాస న్యూస్)://
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం నందు,కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానంలో భక్తుల సమక్షంలో భారీగా దీపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం లో దీపాలతో ప్రకాశమానమైంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.









