పెద్దపాడు లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ – లబ్ధిదారులకు పింఛన్లు అందించిన రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు…!!!

కలిగిరి, నవంబర్ 1 :(మన ధ్యాస న్యూస్)://

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో, కలిగిరి మండలంలోని పెదకొండూరు పంచాయతీ పరిధిలోని పెద్దపాడు గ్రామంలోని మిక్ససింగ్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని, పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు.ఈ సందర్భంగా రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు,పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు. ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?” అని ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు ప్రతి నెలా మొదటి తేదీన పింఛన్ సమయానికి అందుతున్నదని తెలిపారు. తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు,మాట్లాడుతూ-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి అనేక వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించే విధంగా ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ అందించే విధానం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమయానికి, పారదర్శకంగా పింఛన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ మొక్కా హజరత్ రావు, మరియు గ్రామ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్,పెంచలరావు,పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర