మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ ) ఒక చెట్టు – అమ్మ పేరుతో కార్యక్రమంలో మొక్కలు నాటిన ఛైర్మన్ గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పాండే శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.ఈ సందర్శనలో భాగంగా ఆయన “స్వచ్ఛత హీ సేవా – స్పెషల్ క్యాంపెయిన్ 5.0”లో నిర్వహించిన “ఒక చెట్టు – అమ్మ పేరుతో” కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పరిశుభ్రతా కార్యక్రమాలను ఆయన పరిశీలించి, అధికారులు చేపట్టిన నీటి నిర్వహణ, పరిశుభ్రతా చర్యలను అభినందించారు.ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.తరువాత పాండే “ఒక చెట్టు – అమ్మ పేరుతో” కార్యక్రమం కింద ప్రాజెక్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో కనీసం ఒక చెట్టు నాటి దాన్ని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో
మెంబర్ పవర్ రంగరాజన్,సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ ఈ దక్షిణ మూర్తి,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ నిజాంసాగర్ సొలమన్,
డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీఈఈ శర్మిళ,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏఈఈ లు శివప్రసాద్, సాకేత్, అక్షయ్, శ్రుతి,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *