ఉదయగిరిలో ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలు.,చెంచల్ బాబు యాదవ్ ప్రజాసేవలో ఆదర్శప్రాయుడు” అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రశంసలు..!రాజకీయరంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష..!

ఉదయగిరి అక్టోబర్ 31 :(మన ధ్యాస న్యూస్):///

ఉదయగిరి మండల కేంద్రంలో మాజీ జడ్పీ చైర్మన్, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలు అభిమానుల నడుమ ఘనంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , చెంచల్ బాబు యాదవ్ కి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ — చెంచల్ బాబు యాదవ్ రాజకీయరంగంలో విశేష సేవలందించిన నాయకుడని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, యువ నాయకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.అలాగే చెంచల్ బాబు యాదవ్ గారు భవిష్యత్తులో రాజకీయరంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను, అధిరోహించాలని ఆకాంక్షించారు.ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయించి పూలమాలలతో సన్మానించడం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *