వర్షానికి తడుస్తున్న వరి ధాన్యం…. కంటతడి పెడుతున్న అన్నదాత ..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న కష్టజీవి కర్షకుడికి అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభమైన వర్షాలు, ఇప్పటివరకు అన్నదాతలను వదలడం లేదు.జిల్లాలో భారీ వర్షాలు కురవడం,చేతికి వచ్చిన పంట నీటి పాలు కావడం అన్నదాతను అప్పుల పాలు చేస్తుంది.ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పండించిన ధాన్యం ,చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు పండిన నాలుగు గింజలు చేతికి అందకుండా వర్షం తాకిడికి కొట్టుకుపోతున్నాయి.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్ముకుని అప్పులు తీర్చుకొని గడ్డకు పడదాం అనుకున్నా, అన్నదాతకు అకాల వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి.గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద రోడ్డుపై వేసిన ధాన్యం మధ్యాహ్నం భారీ వర్షం పడడంతో వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యాన్ని తీసుకువచ్చి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు.రెండు రోజుల్లో కురుస్తున్న వర్షానికి రైతులు వరి ధాన్యాన్ని ఎండబెట్టడం మళ్లీ వర్షానికి తడిసి ముద్ద అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వారి ధాన్యాన్ని తరలించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • Related Posts

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

    పేదోడి సొంతింటి కల నెరవేరింది..

    మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?