మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ తిరుపతిరెడ్డి శనివారం అకస్మాత్తుగా సందర్శించారు. ప్రార్థన సమయానికే పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ ప్రార్థన కార్యక్రమాన్ని పరిశీలించారు.అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు.
తరగతులను సందర్శించి విద్యాబోధన విధానాన్ని పరిశీలించారు.అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ —ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి. మధ్యాహ్న భోజన సమయంలో పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. విద్య విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ప్రధానోపాధ్యాయులు లైక్ యూనిసాకు సూచించారు. ఎంఈఓ వెంట క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నర్సింలు, ఉపాధ్యాయురాలు యాస్మిన్ తదితరులు ఉన్నారు.









