మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )అక్టోబర్ 25, మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్‌స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి వచ్చే వారికి ముళ్ల పొదలు తగలడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు.ముళ్లపొదలు పెరిగి ఇబ్బందులు పడుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మార్గం గుండా ప్రతిరోజు హెడ్స్ ల్యూస్ కు వందలాది మంది రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముళ్ల పొదలను తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *