మన న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని పేదల భూములు పేదలకు అప్పజెప్పాలని సి పి యం రాష్ట్ర సీనియర్ నేత ఎం కృష్ణమూర్తి తెలిపారు పాచిపెంట మండల కేంద్రం తాసిల్దార్ కార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు సిపిఎం జిల్లా నాయకుడు మర్రి శ్రీనివాసరావు ఎన్వై నాయుడు కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా. ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో రెండు దశాబ్దాల క్రిందట ప్రభుత్వం గ్రామంలో పేద ప్రజలకు రెండు ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి ఢీ పట్టాలు ఇచ్చింది ఈ భూముల్లో తుప్ప డొంక కొట్టి పెద్ద పెద్ద కుమ్ములను సరిచేసి సాగులో ఉన్నటువంటి భూములను ఆ గ్రామ పెత్తందార అయినా మాజీ వైస్ ఎంపీపీ ప్రజెంట్ వైసీపీ నాయకుడు రాజకీయ అండదండలతో పేదలను బెదిరించి భూముని అన్యాక్రాంతం చేశారని, ఆ భూములు కావాలని ముందుకెళ్లిన పేదలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించి చంపుతామని బెదిరించడం భయపెట్టడం చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు స్పందించి పరిష్కారం చేయాలని చట్టపరంగా అన్యాక్రాంతమైన భూములను పేదలకు అప్పగించాలని బయటికి రావడానికి కూడా భయపెట్టే విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు పత్రికా విలేకరులు తో మాట్లాడిన అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ని కలిసి వినతిని అందించడం జరిగింది అనంతరం డిప్యూటీ తహసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ సమస్య తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు 15 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేస్తామని సిపిఎం నాయకుడు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *