విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే !! ఒక్కో కుటుంబానికి 50లక్షలు ఇవ్వాలిజీపు జాతలో ఎస్ఎఫ్ఐ నాయకులు

మన ద్యాస, సాలూరు : నిరుపేద గిరిజనులు తమ పిల్లలను ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తే ప్రభుత్వ వైఫల్యం వల్ల వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారని, ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇంతమంది మృతి చెందటం, ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని, ఇవి ప్రభుత్వ హత్యలుగా చెప్పుకోవచ్చన్నారు. గురు వారం ఉదయం సిపిఎం అనుబంధ సంస్థ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు అనిల్, అఖిల్ ఆధ్వర్యంలో మండలంలోని కురుకూటి, మామిడిపల్లి, ఖరాసువలస గ్రామాల్లో జీపు జాత నిర్వహించారు. అదేవిదంగా ఇటీవల జరిగిన గిరిజన విద్యార్ధుల మరణాలు, వసతి గృహాల్లో సౌకర్యాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం తదితర వివరాలతో కూడిన కరపత్రాలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గిరిజన విద్యార్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే అన్నారు. వసతి గృహాల్లో వైద్య సదుపాయాలు, ఏఎన్ఎంలు మంచి నీరు తదితర సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్దులు ఆసుపత్రుల పాలవుతున్నారని, కొంతమంది మృతి చెందారన్నారు. కురుపాం గురుకుల పాఠశాలలకు చెందిన అంజలి, కల్పనలు కేజీహెచ్లో మృతి చెందటం తెలిసిన విషయమే అన్నారు. అలాగే కురుపాం, కొమరాడ రామబధ్ర పురాలకు చెందిన – ఈశ్వర రావు, జీవన్ కుమార్, రావి కోన – రాఘవ, కొమరాడ కేజీబీవీ – శారద, గుమలక్ష్మి పురం బాలికల పాఠశాల – అవంతిక, బాలుర పాఠశాల – నితిన్, దినేశ్, తనూజ తదితర గిరిజన విద్యార్దులు అనారోగ్యంతో సరైన వైద్యం అందక మృతి చెందారన్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల కంటే జైళ్లే నయమని ఎస్ఎఫ్ఐ నాయకులు అభిప్రాయ పడ్డారు. గురుకుల పాఠశాలల్లో 611మంది విద్యార్దులకు కేవలం 16గదులే ఉన్నాయని, ఒక గదికి 40మంది విద్యార్దులు ఉండాల్సి వస్తుందని దీన్నిబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థమవుతుందన్నారు. సురక్షితమైన త్రాగు నీరు లేదని, ఉన్న ఆర్ఓ ప్లాంటు మరమ్మత్తులకు గురైతే పట్టించుకొనే నాథుడు లేడన్నారు. ఇక మరుగు దొడ్ల గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నారు. పది మందికి ఒక మరుగు దొడ్డి ఉండాల్సి ఉండగా, 30మందికి ఒకటి ఉందని, చెడు వాసన భరించలేమన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వీటిపై వెంటనే దృష్టి సారించాలన్నారు. అదేవిదంగా మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు చెరో 50లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని, అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదన్నారు. ముఖ్యంగా గిరిజన మంత్రి చేసిన మొదటి సంతకం ఏఎన్ఎంల నియామకం తక్షణమే జరపాలని డిమాండ్ చేసారు.కార్యక్రమంలో దివ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!