తవణంపల్లి అక్టోబర్ 21 మన ద్యాస
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో మాజీ ఎంపీ కీ.శే. పాటూరు రాజగోపాల్ నాయుడు 28వ వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారి , అమర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రమాదేవి, అమర రాజా కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ ,సినీ హీరో గల్లా అశోక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరీనేని రాజన్న మెమోరియల్ పార్క్ వద్ద రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో దిగువమాఘం సర్పంచ్ గోపి , మాజీ సర్పంచ్ కుమార్ నాయుడు , రాజన్న ఫౌండేషన్ నిర్వాహకులు సతీష్ రాళ్లపల్లి, యల్లంపల్లి సురేష్, అలాగే గల్లా కుటుంబ అభిమానులు, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.







