పొదలకూరు, అక్టోబర్ 21 :(మన ధ్యాస న్యూస్)://
మంగళవారు పొదలకూరు మండల టౌన్ లోని డా బీఆర్ అంబేద్కర్ భవనంలో,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ లు మాట్లాడుతూ గత నెల 24 తేదిన గూడూరు లోని విశ్వసాయి షోరూం డీలర్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మేక వేమయ్య హీరో షోరూంకు ఆయన లేని సమయంలో వచ్చి అక్కడ వర్కర్స్ ను ఎక్కడకు పోయాడురా వేమయ్య కులం తక్కువ నాకొడుకు అంటూ అహంకారం పౌరుష పధజాలంతో కులం పేరుతో అతనిని తిడుతూ షోరూం లో కొనుగోలుకి సిద్ధంగా ఉన్న ఏడు బైకుల తాళాలు దౌర్జన్యం గా లాక్కొని పోయిన శ్రావణ్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. అతని పై స్థానిక పొదలకూరులో పిర్యాదు ఇచ్చిన ఇప్పటి వరకు పలుమార్లు సీఐ ఎస్ఐ గారి చుట్టూ తిరుతున్న ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో డిపార్ట్మెంట్ వరు సమాధానం చెప్పాలని మీరు ప్రలోభాలకు తలొగ్గి కేసు నమోదు చేయకుండా వెనకడుగు వేస్తున్నారో చేప్పాలని ఇది వరకే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన ఎందుకు ఈ విషయంలో పోలీసులు కేసు నమదు చేయకపోవడం చూస్తుంటే ఉన్నత వర్గాల కోసమే చట్టాలు ఉన్నట్టు అనిపిస్తుందని ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందించి వెంటనే కేసు నమోదు చేసే విధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వేగూరి వెంకటేశ్వర్లు మాదిగలు మాట్లాడుతూ,అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన శ్రావణ్ కుమార్ ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని లేని పక్షంలో అవసరమైతే
ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకు వెళ్తామని వారి ఆదేశాలతో చలో పొదలకూరు పిలుపునకు కూడ వెనకడుగు వేయబోమని తక్షణమే శ్రావణ్ కుమార్ ని అరెస్ట్ చేయాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చింతకుంట అంకయ్య మాదిగ,దర్శిగుంట శ్రీనివాస్ మాదిగ,నక్కిబోయిన గంగాధర్ మాదిగ,సబ్బు వెంకటేశ్వర్లు మాదిగ,వెంకటేశ్వర్లు మాదిగ,నరసింహ మాదిగ,ఏడు కొండలు మాదిగ,మేక రమేష్ మాదిగ.పి పెంచలయ్య మాదిగ,కుంచం సుబ్బయ్య మాదిగ,శివ మాదిగ, సూర్యబాయ్ మాదిగ, బాలకృష్ణ మాదిగ,చంద్ర మాదిగ,మురళి మాదిగ,వెంకటగిరి,సర్వేపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో పోల్గొన్నారు.








