తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి
పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని సూచన
కలిగిరి, అక్టోబర్ 19 :మన ధ్యాస న్యూస్ :///
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి కాకు మహేష్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే వెలుగుల పండుగ అని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ బాణాసంచాను కాల్చుకోవాలని సూచించారు. పర్యావరణహితం కోసం పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాకుండా వెలుగుదివ్వెలు విరజిమ్మే టపాసులు కాల్చాలన్నారు. తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంధకారంపై వెలుగు సాధించిన పండుగ దీపావళి స్ఫూర్తితో మండల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని కలిగిరి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కాకు మహేష్ ఆకాంక్షించారు.







