భైరవరం ఎంపీటీసీ పరిధిలో అభివృద్ధి పనులకు కొత్త ఊపు – ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కి ప్రజల కృతజ్ఞతలు..!!!

దుత్తలూరు, అక్టోబర్ 15 :(మన ధ్యాస న్యూస్ ):///

ఉదయగిరి నియోజకవర్గం ముద్దుబిడ్డ, శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాయకత్వంలో భైరవరం ఎంపీటీసీ పరిధి అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. తెలుగుదేశం పార్టీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 16 నెలలు పూర్తైన ఈ సమయంలో, మండల అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.భైరవరం ఎంపీటీసీ పరిధిలో సుమారు రూ.70 లక్షల విలువైన అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో విశేష పురోగతి కనిపిస్తోంది. అలాగే గ్రామ పశుసంవర్ధనాభివృద్ధి కోసం మినీ గోకులం షెడ్లను పంచాయతీలకు మంజూరు చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మైలురాయిగా నిలిచింది.ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ప్రయోజనం ప్రతి ఇంటికి చేరుకునేలా చూస్తూ, రాచవారిపల్లి, భైరవరం వంటి పంచాయతీల్లో విశేష మార్పులు తీసుకొచ్చాయి. మెగా DSC వంటి ఉపాధి అవకాశాలు యువతకు దోహదపడుతున్నాయి.దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15,000 – కూటమి ప్రభుత్వానికీ కృతజ్ఞతలు,దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భైరవరం ఎంపీటీసీ పరిధిలోని ఆటో డ్రైవర్లకు రూ.15,000 సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేసింది. ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నేరుగా అర్థిక సహాయం జమ కావడంతో, స్థానిక ఆటో డ్రైవర్లు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబ అవసరాలకు ఇది ఎంతో ఉపయోగపడిందని వారు అన్నారు.ఈ సహాయం అందించడంలో ముఖ్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీసుకున్న చొరవ, ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు అర్థమయ్యేలా చేసింది.రాజకీయాల్లోకి యువత ప్రవేశానికి ప్రోత్సాహం,భైరవరం ఎంపీటీసీ పరిధిలో యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించడంపై నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంలో ముందుండి నడుస్తూ, వారితో ప్రత్యక్షంగా సమావేశమై మార్గనిర్దేశనం చేస్తున్నారు.సమాజ సేవ, ప్రజా సమస్యలపై అవగాహన, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాల్లో యువతను ప్రోత్సహిస్తూ, గ్రామస్థాయిలో వారికి కొత్త భాద్యతలు అప్పగించడం ద్వారా నాయకత్వాన్ని పెంపొందిస్తున్నారు. పార్టీ స్థాయిలో కొనసాగుతున్న సభ్యత్వ కార్యక్రమంలో యువత విశేషంగా పాల్గొనడం పార్టీ పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పటికే 70% పూర్తవ్వడం ఘన విజయంగా నిలిచింది. ఈ ప్రక్రియలో యువత చురుకైన పాత్ర పోషించడంతో, భవిష్యత్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టే వారు సిద్ధమవుతున్నారు.ఈ అభివృద్ధి శ్రేణికి తోడుగా, అన్నపరెడ్డి వెంగల్ రెడ్డి, ఉండేల గురవారెడ్డి , మల్లంపాటి గురవయ్య నాయుడు వంటి స్థానిక నాయకులు తమ అనుభవంతో మద్దతుగా నిలుస్తూ, మండల అభివృద్ధి ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు.ఈ సందర్భంగా భైరవరం ఎంపీటీసీ పరిధిలోని ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరియు కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అభివృద్ధి పనుల పట్ల ప్రజల లోన ఉన్న సంతృప్తి, ప్రభుత్వ పథకాల పట్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.అని అన్నపురెడ్డి వెంగలరెడ్డి, ఉండేలా గురువారెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు,తెలుపుతున్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?