
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సోమవారం కృత్రిమ మేధస్సు పై విద్యార్ధులకు 6 రోజుల శిక్షణ శిభిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత ప్రారంభించారు. తరువాత విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి తరం మరియు రాబోయే కాలమంత కృత్రిమ మేధస్సు పై ఆధారపడి జీవిస్తారని, కృత్రిమ మేధస్సు అనేక ప్రయోజనాలను అందిస్తుందని పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడం,ఉత్పాదకతను పెంచడం,ఇది విద్య నుండి వైద్యం, వ్యాపారం మరియు వ్యవసాయం వరకు ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని సేవలు మరియు ఉత్పత్తులను వ్యక్తిగతీకరించడానికి సహాయపడుతుంది.ఎ1యొక్క ప్రాముఖ్యత రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తుందని,స్మార్ట్‌ఫోన్ అన్లాకింగ్ ,మానవులకు ప్రమాదకరమైన పనులను ద్వారా నిర్వహించవచ్చునని, ముఖాన్ని గుర్తించడం వంటి ఫీచర్ల ద్వారా మన రోజువారీ జీవితంలో భాగంగా మారిందని, గతంలో పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలదని, భారీ మొత్తంలో డేటాను త్వరగా విశ్లేషించడానికి సహాయపడుతుందని కాబట్టి కృత్రిమ మేధస్సు పై విద్యార్ధులందరు శిక్షణ పొంది ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షణ అభియాన్ లో భాగంగా ఈ శిక్షణ శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,విద్యార్డులను గ్రూప్లుగా విభజించి,40 మంది ఒక గ్రూప్ గా శిక్షణ పొందుతారని,ఈ శిక్షణ ఎక్షిస్ పాయింట్,సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ,ఆంధ్ర ప్రదేశ్ వారిచే ఇవ్వబడుతుందని ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,జెనెరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటి,మిషన్ లెర్నింగ్,డేటా సైన్స్ ,ప్రామ్టు ఇంజనీరింగ్ మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.ఈ శిక్షణ కార్యక్రమానికి కె.వెంకేటేశ్వర రావు,డా.ప్రయాగ మూర్తి ప్రగడ,కె.సురేశ్ కన్వెనెర్స్ గా ఎక్షిస్ పాయింట్ చెందిన శ్రావణి,యశశ్వి శిక్షకులుగా వ్యవహరిస్తారని తెలియజేశారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం ప్రిన్సిపల్ డి సునీత మరియు ఎక్షిస్ పాయింట్ ,సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆర్ వేణు మరియు సాయి కృష్ణలు ఎంఓయూ కుదుర్చు కోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో అద్యాపకులు వి.రామా రావు డా.మదీనా,శివ ప్రసాద్, శ్రీలక్ష్మి, వీరభద్ర రావు,బంగార్రాజు,సతీశ్,మేరీ రోజలీనా,పుష్పా,రాజేష్ అధ్యాపకేత సిబ్బంది సత్యనారాయణ,ధర్మ రాజు, దివ్య,రామలక్ష్మి కమల,కళావతి,పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.







